తత్వమెరుగవే మనసా
నీ తత్వమెరుగవే మనసా
నిజతత్వమెరుగవె మనసా
ఉన్ననాడు ఉన్నదున్నదని వగచేవు
లేనినాడు లేనేలేదని తలచావు
ఉందీ లేదనె ఆరాటంలో
జారే కాలము మరచావు
చేజారేకాలము మరచావు
నీ తత్వమెరుగవే మనసా
నిజతత్వమెరుగవె మనసా
ఉన్ననాడు ఉన్నదున్నదని వగచేవు
లేనినాడు లేనేలేదని తలచావు
ఉందీ లేదనె ఆరాటంలో
జారే కాలము మరచావు
చేజారేకాలము మరచావు
తత్వమెరుగవె మనసా
నీ తత్వమెరుగవె మనసా కాటికి కాళ్ళని చాచావు
ఆశల కొండలు ఎక్కావు
కన్నులు చూడని కలల కోసమై
కానెలెన్నో తిరిగేవు
కనిపించని దారులు వెతికావు
ఆశలకొండల అధిరోహణలో
జారే కాలము మరచావు
కన్నును మూసిన కలల బాటలో
చేజారే కాలము మరచావు
తత్వమెరుగవే మనసా
నీ తత్వమెరుగవె మనసా
నిజతత్వమెరుగవె మనసా
నీదను నాదను వాదులాటలో
వలలో చిక్కి తిరిగావు
కాలికి బంధం వేసావు
నేనే నీదను కల్లలాటలో
నిన్నే నీవు మరచావు
జగమంతా నీదని తలచేవు
చిక్కిన వలలో తిరిగే నీవు
జారినకాలం మర్చావు
కల్లలాటలో కలకలమంటో
చేజారిన కాలం మరచావు
తత్వమెరుగవే మనసా
నీ తత్వమెరుగవె మనసా
నిజతత్వమెరుగవె మనసా
నీ తత్వమెరుగవె మనసా
నిజతత్వమెరుగవె మనసా