ఏకాంతపు గమనంలో
ఎన్నెన్నో మజిలీలు
చిన్ని చిన్ని గవ్వల్లా ఏరుకున్న
అందమైన గురుతులు కొన్నైతే
చురుక్కుమనే ముల్లులా గుచ్చిన
వేధించే గాథలు మరికొన్ని....
సాగే ఈ పయనంలో
దరహాస చంద్రికలు విరిసినట్లే
దుఖాశ్రువులూ కురిశాయి
అనుభవం అనుభూతయ్యేలోగానే
చేజారిన కాలం అది గతమంటో
వెక్కిరించింది వేదనలో ముంచింది
అయినా .....
చీకటిన దాగిన వెలుగుతెరలా
మబ్బున దాగిన చిన్నచినుకులా
నీ ప్రేమ నన్ను పిలుస్తోనే వుంది
నీకై నా పయనం అలా సాగుతోనే వుంది
చాలా బాగుంది ...శుభాకాంక్షలు
ReplyDeleteSagar garu
ReplyDeleteThank You