అక్కమహాదేవి
1.కలిమిలేములయందు సమముగా నిల్చినావు
నీలకంఠుడే నీకు తోడు నీడన్నావు1.కలిమిలేములయందు సమముగా నిల్చినావు
2.చంద్రశేఖరుడి నీడ చల్లంగ చేరేవు
శ్రీశైల శిఖరాన సిరులకలువవైనావు
కరిచర్మధారుని కదళివనమున
కొంగుబంగారమని కోరి కొలిచేవు
3.మల్లికార్జునిమీదమదినెల్లనిలి
కరుణాంతరంగునికరుణగ్రోలావు
నీలాలశిఖరాననియమంబుగనిలిచి
శశిధారిహృదయానశయనించినావు
4.అవనిరథమైనాంబికానాథుని
అంతరమునికాచుఆత్మనాథుని
అమితప్రేమతోకూడిఆదినాదంతోటి
అర్చింపబూనేవు అచలనాథుడిని
అర్చింపబూనేవు అచలనాథుడిని
5.నిటలాక్షునేకొల్తునిక్కంబు
6.నిజరూపమేమారెనిత్యనటనములందు
నిత్యరంగస్థలిమీద నటరాజునటనంబు
నిండార నేచూడ కాంతినొసంగుతల్లి మరినియమంబునేనెరుగనీదుపాదంబుతప్ప
7. కన్నుగానని కారడవులయందు
చెంద్రుడెరగనిచిమ్మచీకట్లయందు
కట్టుబట్టలవిడిచికట్టుబాటునుతెం చి
చరియించినావుసుజ్ఞానపథమందు
8. జ్ఞానమంటపపుమందుజ్ఞానివైవెలిగా
భక్తకోటియందుమెరయుభవ్యదీపికవునీ వు
మదనాంతకునిమదినమందారమైనావు
మధురభావంబుకేమాధుర్యంబొనొసగావు
9. గురునిబోధయందుదృష్టిమాకొసగు
సత్యబలమునివ్వి మాకు భవునిచేర
గురుచరణంబునేతల్చుప్రణవంబునేపలు కు
సద్భుద్ధినేయిచ్చిశంకరునికిమమ్ముచేరబిలువమ్మా
10.నీదునామస్మరణంబు శివభక్తినొసగు
నీదుధ్యానమేనిచ్చునిటలాక్షుసన్నిధి
మూడుకన్నులతోటిముదమారచూడ
ప్రణతులెన్నోనీకుపరవశించినేచేయు
11. గురుని కరుణతోడు మంత్రంబుతోడు
పరమశివుడుతోడు పద్యధారలయందు
పయనించునామనసుపరమనిశ్చలమై
ప్రణతులెన్నోసేయుపరమపూజ్యులకున్
12. తారనేతల్చుసభక్తిపూర్వకమున్
పద్యధారనొసగిన పరమపావనిని
దవ్వుతానైనధవళపాదంబులకి
అశ్రుధారలతోనేఅభిషేకమొనరింతు
No comments:
Post a Comment