రాగమాలపించిన నేల నేడు విరాగియై నిలిచింది
మువ్వలరవళికి మ్రోగిన మోవి నేడు మౌనమై నిలిచింది
వెన్నెలక్రీడని చూచిన తార చీకటిన వేచింది
మరచిపోకు ప్రభూ
మరలిరా
వేణురాగంతో విరాగిని రాగమయం చేసేందుకు
మువ్వలరవళితో మౌనాన్ని గానమయం చేసేందుకు
వెన్నెలవెలుగుతో తారకలకన్నుల దీపమై వెలిగేందుకు
మరలిరా ప్రభూ
మరచిపోకు
No comments:
Post a Comment