నా పయనం లో
నీకై
జీవితపు అరుగుమీద
అనురాగపు జల్లులుచల్లి
ఆశలరంగవల్లులు దిద్ది
చిరునవ్వుల తోరణాలు కట్టిజీవితపు అరుగుమీద
అనురాగపు జల్లులుచల్లి
ఆశలరంగవల్లులు దిద్ది
వెన్నెలదీపాలు పెట్టి
ప్రేమమాలని కానుకనిద్దామని
ముంగిలిలోనే వేచి ఉన్నాను
ముంగిలిలోనే వేచి ఉన్నాను
లోకపు స్వార్ధపుకరకు జల్లుల్లో
నా రంగవల్లులు కన్నీరవుతుంటే
మోసపు వేడికి తాళలేక
తోరణాలు వసివాడుతుంటే
ఎండలగాలుల్లో నిలువలేక
వెన్నెలదీపాలుమసకబారుతుంటే
వేచి ఉన్నముంగిలి నీడ అన్న నిజంలో
ప్రేమమాల ముకుళించుకుపోతోంటే
చీకటి సముద్రంలో
నిరాశల తుఫానులో
మినుకు మినుకుమంటున్న ప్రాణదీపంతో
దాచినవన్నీ దాటలేని ఎండమావిలో కోల్పోయి
ఇప్పుడు కేవలం
గుప్పెడు అశ్రువులతో మాత్రమే
నీకై పయనిస్తున్నాను ప్రభూ !
మినుకు మినుకుమంటున్న ప్రాణదీపంతో
దాచినవన్నీ దాటలేని ఎండమావిలో కోల్పోయి
ఇప్పుడు కేవలం
గుప్పెడు అశ్రువులతో మాత్రమే
నీకై పయనిస్తున్నాను ప్రభూ !
No comments:
Post a Comment