అదిగదిగో అలనాడు ఆ నెలరాజు
అదిగో ఆనాడు జారిన ఆ వెన్నెలతునక
ఆనాడు నీ రాసధారలో
తడిసి ముద్దై మురిసిన
మందారం మిదిగో బిడియంతో ఎర్రబడే వుంది నేటికీ
అదిగో నీ మంజీరపాదరవళితో మమేకమైన
బృందావని ఇంకా నీ మువ్వల మధుర నాదంతో
ఘల్లు ఘల్లు మంటొనే ఉందీనాటికీ...
దోబూచులదొంగాటలనాడి
నీ రాధ పొగడసుధలజాడతో ఇంకా
పూపొదలచాటునవెతుకాడుతోనే ఉంది నేటికీ ...
ఇదిగో ఇప్పుడో అప్పుడో
వచ్చేస్తావని పిచ్చితల్లి
ఇంకా అటూ ఇటూ గడపలోనే
తిరుగాడుతోనే ఉందీనాటికీ ...
తిరుగాడుతోనే ఉందీనాటికీ ...
పాశం తో నిన్ను బంధించగానే
పాశహారివై తిరిగిరాని వీడ్కోలు నువ్వు చెప్పావని
ఆ తల్లికి ఎవరు చెపుతారు ?
నిండుకోని వెన్నకుండా..
పగులెరుగని నీటికుండా...
మూగపోయిన మౌనవేణువా....
మరువలేని మధురారాధనా.......
Dhatri garu
ReplyDeleteThank You.