వెలుగుల అలలపై తేలియాడుతున్న
కలల నావ కఠిననిజం తాకిడికి
తట్టుకోలేక తిమిరపు నీడన కరిగినప్పుడే
తెలుస్తుంది నాకు
కలల నావ కఠిననిజం తాకిడికి
తట్టుకోలేక తిమిరపు నీడన కరిగినప్పుడే
తెలుస్తుంది నాకు
నువ్వు ఈ రోజు కూడా
రాలేదని..
దగ్గరైన ఆరోజు మరింత దూరమైందని
రాలేదని..
దగ్గరైన ఆరోజు మరింత దూరమైందని
వేకువ ఒడిన వెలిగిన వసుధ
కదిలే కాలపు చక్రంలో చిక్కని నీ
విరహపు వేడిమి తాళలేక
చీకటి నీడన చేరినప్పుడే
తెలుస్తుంది నాకు
విరహపు వేడిమి తాళలేక
చీకటి నీడన చేరినప్పుడే
తెలుస్తుంది నాకు
నువ్వు ఈ రోజు కూడా
రాలేదని..
దగ్గరైన ఆరోజు మరింత దూరమైందని
రాలేదని..
దగ్గరైన ఆరోజు మరింత దూరమైందని
తలపుల్లో కురుస్తున్న వలపులన్నీ
ఊహలలల్లిన ఊసులమాలలే నని
జాలిగా నను తాకిన కన్నీటి స్పర్శ
నా చెక్కిలిని తడిపినప్పుడే
తెలుస్తుంది నాకు
తెలుస్తుంది నాకు
నువ్వు ఈ రోజు కూడా
రాలేదని..
దగ్గరైన ఆరోజు మరింత దూరమైందని
రాలేదని..
దగ్గరైన ఆరోజు మరింత దూరమైందని
No comments:
Post a Comment