వెతుక్కో నిన్ను నువ్వు
విరబూసిన వెన్నెల వెలుగులలో
విచ్చిన విరజాజుల పరిమళంలో
తొలకరికి పులకిస్తున్న భూమాత పరవశంలో
మనసుని తడుతున్న ప్రకృతి స్నేహ స్పర్శలో
వెతుక్కో నిన్ను నువ్వు
మూసేసిన మనసు తలుపు తెరిచి
వెతుక్కో నిన్ను నువ్వు
మనసు మూలల్లో దాచుకున్న
జ్ఞాపకాల వర్షంలో దాగిన గులాబీలలో
గుచ్చిన ముళ్ళు వదిలిన గాయాలలో
అనుభవాలు నేర్పిన పాఠాలలో
అనుభూతులు ఇచ్చిన చిరునవ్వులలో
వెతుక్కో నిన్ను నువ్వు
జీవన పరుగుపందెం ఒకసారి ఆపి
అమ్మ ఒడిలో పాపాయిలా
స్వచ్ఛంగా స్నేహంగా
నీకోసం కేవలం నీకోసం మాత్రమే
వెతుక్కో నిన్ను నువ్వు.....
విరబూసిన వెన్నెల వెలుగులలో
విచ్చిన విరజాజుల పరిమళంలో
తొలకరికి పులకిస్తున్న భూమాత పరవశంలో
మనసుని తడుతున్న ప్రకృతి స్నేహ స్పర్శలో
వెతుక్కో నిన్ను నువ్వు
మూసేసిన మనసు తలుపు తెరిచి
వెతుక్కో నిన్ను నువ్వు
మనసు మూలల్లో దాచుకున్న
జ్ఞాపకాల వర్షంలో దాగిన గులాబీలలో
గుచ్చిన ముళ్ళు వదిలిన గాయాలలో
అనుభవాలు నేర్పిన పాఠాలలో
అనుభూతులు ఇచ్చిన చిరునవ్వులలో
వెతుక్కో నిన్ను నువ్వు
జీవన పరుగుపందెం ఒకసారి ఆపి
అమ్మ ఒడిలో పాపాయిలా
స్వచ్ఛంగా స్నేహంగా
నీకోసం కేవలం నీకోసం మాత్రమే
వెతుక్కో నిన్ను నువ్వు.....
good
ReplyDeleteబ్లాగుల లోకానికి స్వాగతం, చక్కని మొదటి టపాకి అభినందనలు.
ReplyDelete'వెన్నెల వీచిక'.. మీ బ్లాగు పేరు చాలా అందంగా ఉందండీ. మీ వెన్నెల హృదయం కూడా బావుంది. తెలుగు బ్లాగ్లోకానికి స్వాగతం. :)
ReplyDeleteకష్టేఫలె గారు, ట్రీ గారు, మధురవాణి గారు
ReplyDeleteధన్యవాదములు
మీ అందరకి వెన్నెల లోకానికి స్వాగతం
బ్లాగ్ ప్రపంచానికి స్వాగతమండీ. మీ బ్లాగ్ పేరు, కవిత రెండూ అందంగా వున్నాయి.
ReplyDeleteజ్యోతిర్మయి గారు
ReplyDeleteధన్యవాదములు
వెన్నెల లోకానికి స్వాగతమండి.
గుచ్చిన ముళ్ళు వదిలిన గాయాలలో
ReplyDeleteఅనుభవాలు నేర్పిన పాఠాలలో
మంచి పద ప్రయోగం.know thy self అంటారు కదా!దాన్ని మీ కవితలో ఎంతో అందంగా పలికించారు.
మీ మొదటి కవిత చాలా చక్కగా ఉంది...
ReplyDeleteవెన్నెల వీవనలాగే ఉంది...
అభినందనలు...
@శ్రీ
రవిశేఖర్ గారు, శ్రీ గారు
ReplyDeleteధన్యవాదాలు