Tuesday, 7 August 2012

ఎప్పటి లానే... నీకోసం......

నా వేదన నీకు చెపుదామని వచ్చిన మలయసమీరం
నీ మౌనాన్ని చూసి తానూ నిశబ్దమై వెనుతిరిగింది

నా జాడ నీకు తెలుపుదామని పరుగున వచ్చిన నీలిమేఘం
నీ కోపాగ్నిలో కరిగి కన్నీరై భోరుమంది

మరి నేను
 

నేను మాత్రం అలానే...
ఎప్పటిలానే...

ఒకప్పుడు వెల్లువై నన్ను ముంచెత్తిన
నీ ప్రేమవర్షంలో ఇంకా తడుస్తూనే
అలానే...
ఎప్పటి లానే...

నీకోసం......



3 comments:

  1. మనం చేయగలిగింది కూడా అంతేనేమో నండి.ha,ha,...

    ReplyDelete
  2. Tree garu
    అంతే అని తెలుసుకునేదాక అంతేనండి. :)

    ReplyDelete