Wednesday, 22 August 2012

ఆ క్షణాన్నే ......

నిశబ్ద నిశీధిలో
నిదుర పట్టని రాత్రిలో
ప్రతీ చిరుసవ్వడీ
నువ్వు చేస్తున్న  సందడేమోనని
నా మది లయ తప్పుతున్న వేళ

నువ్వు వస్తావేమో అన్న ఆశతో
అంతలోనే రావేమోనన్న నిరాశతో
నా మనసు నిశబ్దంలోకి జారుకుంటున్నవేళ

నీ అడుగుల సవ్వడి నా హృదయపు సవ్వడై

నీ పిలుపు నా ఊపిరై
నీ రూపం నా కన్నులై
నీ ప్రేమ నా చిరునవ్వై
నా చెక్కిలిపై నీ శ్వాస
తీరిన నా ఆశల గుబాళింపై
నా మనసంతా నీవై
నేనే నీవవుతున్న ఆ క్షణాన ......

ఆ క్షణాన్నే  ......
నాకు తెలిసింది ........
నీవే నేనని
నీవు లేక నేను లేనని  
లేనే లేనని 

4 comments:

  1. చక్కని భావగుచ్ఛం
    చాలా బాగుంది..
    @శ్రీ

    ReplyDelete
  2. శ్రీ గారు, రవిశేఖర్ గారు
    ధన్యవాదాలు.
    "భావగుచ్ఛం" ఈ పదం చాలా బాగుంది.

    ReplyDelete
  3. భావగుచ్చం పదం చాలా బాగుంది. కవిత బాగుంది.

    ReplyDelete