Saturday, 22 December 2012

రాధానురాగం


కురుస్తున్న వెన్నెల వానలో
విరుస్తున్న సుమాల వన్నెల నావ

విరుస్తున్న వన్నెల నావలో
మురిపిస్తున్న మురళీధార

మురిపిస్తున్న మురళీ ధారలో
పల్లవిస్తున్న రాధాకృతి

పల్లవిస్తున్న రాధాకృతిలో
జాలువారుతున్న వేణుసుధ


జాలువారుతున్న వేణుసుధలో
పరవశిస్తున్న  రాధారాగం


పరవశిస్తున్న  రాధారాగంలో
కరిగిపోతున్న వంశీరవనాదం

 
కరగిపోతున్న వంశీనాదంలో
కలసిపోతున్న రాధానురాగం.

    
    

2 comments:

  1. మీ కలం నించి జాలువారిన రాధానురాగంలో
    స్పందించిన హృదయాల కరతాళ తాళం..

    ReplyDelete
  2. పద్మార్పిత గారు, రమేష్ గారు
    ధన్యవాదాలండి.

    ధాత్రి గారు
    మీ స్పందనాభినందనలకి నా కృతజ్ఞతలండి.

    ReplyDelete