వెతికాను నీకోసం
చిన్నిపాపల చిరునవ్వులలో
మంచున తడిసిన మల్లెలలో
వెతికాను నీకోసం
అమ్మ చూపిన ప్రేమలో
అన్న చూపిన స్నేహంలో
వెతికాను నీకోసం
కరకుగుండెల లోకంలో
ఆగని కాలగమనంలో
వెతికాను నీకోసం
పరిహసిస్తున్న ప్రపంచంలో
ప్రతీ అణువణువులో
వెతికాను నీకోసం
మండుటెండలో తాకిన మలయసమీరంలో
ఒంటరిగుండెను తడిమిన స్నేహసుగంధంలో
నీడని తప్ప నిజాన్ని చూడలేని దాగుడుమూతలలో
ప్రతీ వెతుకులాటా ఒక ఎండమావై
మానని గాయమై
మాయని జ్ఞాపకమై......
వెతకలేక వెతలు తీరక
వేకువ ముంగిట నే వేచియున్నాను
ప్రభూ !
దివారాత్రములకి అతీతమైన నీ వెలుగు చూడాలని....
హృదయపులోతులకి తెలిసిన నీ ప్రేమని తాకాలని......
chaalaa baavundi andi
ReplyDeletecool post
ReplyDelete" చెప్పాలంటే " గారు, పద్మార్పిత గారు
ReplyDeleteధన్యవాదములు
సరళమైన పదాలు స్పష్టమైన భావం..
ReplyDeleteచాలా బాగుంది వెన్నెలవీచికగారు..నిజంగానే మీ కవితను చదివిన అనుభూతి వెన్నెలవీచిక తగిలిన అనుభూతే..:))
Dhatri garu
ReplyDeleteThank You.