మురిపెంతో ముద్దుగా తిలకాన్ని దిద్దుదామంటే
మూడు కనులు తో ముక్కంటి వైనావవు
చందమామని చూపి మురిపింప చేద్దామంటే
నెలవేలుపుని దాల్చి చంద్రశేఖరుడైనావు
అంబుధిని చూపి అబ్బురపరుద్దామనుకుంటే
విష్ణుపాదపద్మజని శిరమున ధరించి గంగాధరుడైనావు
కావ్యంలా కదలాడే చేపలని చూపుదామంటే
సుందరమగు మీనాక్షిని కూడి అర్ధనారీశ్వరుడైనావు
తీపి తీపి పరమాన్నాన్ని తియ్యగా తినిపిద్దామంటే
కంఠాన నిండుగా గరళం దాల్చి నీలకంఠుడైనావు
ఏ మురిపం లేక నినుకన్న
తల్లి చిన్నబుచ్చుకుంటుందని
తల్లి నే వద్దనుకుని
దిగంబరుడైనావు
నీ కరుణామృతం నవనీతం
అందుకే నీకై నిన్ను పొందుటకై కదూ
నే నవనీతచోరుడైనది...
చాలా బాగుంది.
ReplyDeleteఅద్భుతం
ReplyDelete