ఎదురుచూపుల ఎండలో
అలుపు తెలియని ఆరాటంలో
నిరాశ నిండిన చీకట్లలో
నిన్నటి కధ నేటికి కలైనా
కన్నీరు కూడా నా తోడునిలువక
నీకై జలజలమని పరుగులిడుతుంటే
నేనున్నానని తనలోకి కలుపుకున్న ప్రేమ
నీ జ్ఞాపకం
దారి తెలియని ఒంటరివీధిలో
దప్పిక తీరని ఎడారిలో
నిలువెల్ల తడిపిన అమృతవర్షం
నీ జ్ఞాపకం
నీ జ్ఞాపకం
నీకన్నా మధురం ఈ ఏకాంత అన్వేషణలో
నేను పిలువని నను వీడని నా అపురూప చెలిమి
నీ జ్ఞాపకం
నీ జ్ఞాపకం
ReplyDeleteనీకన్నా మధురం ఈ ఏకాంత అన్వేషణలో
నేను పిలువని నను వీడని నా అపురూప చెలిమి
నీ జ్ఞాపకం.....
ఎంత చక్కని జ్ఞాపకం అండి
మంజు గారు
Deleteధన్యవాదాలండి.