చిన్ని చిన్ని ఊసులన్నీ
అష్టభార్యలు నీకు
గోధూళివేళ గోకులవీధిన
రాచనగరు వీధిన విహారంలో
వ్రజవీధికి నీ స్ఫురణలో చోటే లేదే
నవనీతం ఆరగింపచేస్తుంటే కన్నులారా
చూద్దామనుకున్నాను
కృష్ణా
వింతవింత భక్ష్యాలేకానీ
వింతవింత భక్ష్యాలేకానీ
వెన్నపూసకి నీ విందులో చోటే లేదే
వ్రాయలేని రాసలీలమాధుర్యాన్ని
ఒడిని నింపుకున్న బృందావనిలో
నిన్నుకనుల నింపుకున్నరాధాదేవి
తన శ్వాస నీవంటే సమీరమై వెళ్ళాను
కృష్ణా
మరి తన మదిలో నీ వలపు తలపు
నిశ్వాసమే తప్ప ఉఛ్వాసానికి చోటేలేదే
కృష్ణా
మరి తన మదిలో నీ వలపు తలపు
నిశ్వాసమే తప్ప ఉఛ్వాసానికి చోటేలేదే
చాలా చాలా బావుంది కవిత మొత్తం ఎంత బాగా రాశారండి
ReplyDeleteవ్రజవీధికి anTea ardham eamiTi?
ReplyDeleteKavita chaalaa bavundi..
Manju garu
ReplyDeleteమీ స్పందనకి ధన్యవాదాలండి
@అనానిమస్ గారు
ధన్యవాదాలు.
కృష్ణుడు చిన్నతనాన మసలిన బృందావనం, వ్రేపల్లె ఆ ప్రాంతాలన్న అర్ధంతో వాడాను.వ్రజము అంటే వ్రేపల్లె అని ఒక అర్ధం వుంది. గోపకాంతలని వ్రజకాంతలనడం కూడా కద్దు.
hmm
ReplyDelete