సాగక తప్పదీ పయనం
ఎందాకో ఎందుకో తెలియని
అంతేలేని ఏకాంత పయనం
గాయమవుతున్న గుండెకి
జ్ఞాపకాల లేపనాలు రాస్తో
ముక్కలవుతున్న మనసుకి
రేపటి ఆశల అతుకులు వేస్తో
సడలిపోతున్న నమ్మకాల వెనుక
నిజాలని నమ్మలేక చూస్తో
సాగక తప్పదీ పయనం
ఎందాకో ఎందుకో తెలియని
అంతేలేని ఏకాంత పయనం
Nice One!
ReplyDeleteఈ పయనం మనసు హత్తుకుందండి!
ReplyDeleteగాయమవుతున్న గుండెకి
ReplyDeleteజ్ఞాపకాల లేపనాలు రాస్తో...
చాలా బాగుంది...@శ్రీ
good
ReplyDeleteసుభ గారు, పద్మార్పిత గారు , శ్రీ గారు , చిన్ని గారు
ReplyDeleteమీ అందరికీ ధన్యవాదాలండి.