తూరుపుదీపం కొండెక్కుతోంది.
ప్రభువు వచ్చే వేళైందని కాబోలు
ఆకాశం సిగ్గుతో ఎర్ర బారింది.
పుడమి అతని పాదస్పర్శకై ఎదురు చూస్తోంది.
తన అడుగుల సవ్వడి వినటానికి సెలయేరు నెమ్మదైంది
మలయమారుతం తను వచ్చేదారిలో సుగంధాలని అద్దుతోంది.
శారదరాత్రి జాబిల్లి ప్రభువు కోసం వెలుగులు పరుస్తోంది.
నిశబ్దంగా, నిశ్చలంగా అందరూ తన అడుగుల సవ్వడికై ఎదురుచూస్తున్నారు.
యుగాలు గడుస్తున్నా .....
నేను కూడా ఎదురుచూస్తున్నా
తనకై
మృదుమనోహరమైన ప్రేమ హృదిలో దాచుకుని.

కవిత మనసుని దోచెను...
ReplyDeleteపద్మార్పిత గారు
ReplyDeleteకవిత మీ మనసుని దోచలేదుటండి. దాచుకుందిట. :)
ధన్యవాదాలండి.