పాశం లేదంటావు
రాతి రోటికి కట్టిన పాశానికి బద్ధుడైనావు
రాగం లేదంటావు
రాణుల అనురాగానికి రంజిల్లావు
అందరూ సఖులు ఒకటే అని మరపిస్తావు
అటుకులకి మాత్రమే మురుస్తావు
దొంగని కానంటావు
మనసుని దోచేస్తావు
ఏ పత్రమైనా ఒకటే అంటావు
బృందపత్రానికే తూగుతావు
ఏ పుష్పమైతేనే అంటావు
మానసపుష్పానికై మారాం చేస్తావు
ఏ ఫలమైతేనే అంటావు
భక్తి ఫలానికే వరమవుతావు
తోయమైనా చాలంటావు
ప్రేయసి ప్రేమారాధనాధార కే కరుణిస్తావు
బంధరహితుడు ని అంటావు
రాధా హృదయంలో బందీవై వుంటావు
కృష్ణా ! నువ్వు అంటున్నదొకటి చేస్తున్నదొకటి
నిన్ను నమ్మేదెలా అంటే
రాధా ! నిన్ను నువ్వు నమ్మేందుకు
సందేహమెందుకు ! అంటావు
chaala bagundi.
ReplyDeletePadmarpita garu
ReplyDeleteThank you.