నీ పేరే పలువరిస్తున్న
నా గుండె చప్పుడు ఆగిందంటే
నీ ఊహే శ్వాస తీస్తున్న
నా ఊపిరి ఊయల ఆగిందంటే
నిన్నే ధ్యానిస్తున్న
నా ప్రాణం నిలిచిందంటే
ప్రియతమా
ప్రియతమా
అదే నీకు గుర్తు
నేను లేనని
నీలో కలిసి నీ దాననైనాని
ప్రియతమా
ప్రియతమా
అదే నీకు గుర్తు
నీ ఆరాధనలో
నీదాననై నీ రాధనై
ఇంక తిరిగిరాని
నివేదన అయినానని
రాధ మానస గీతం..
ReplyDeleteమాధవునికి చేరే ఉంటుంది...
అభినందనలు..
బాగా వ్రాసారు...
@శ్రీ
wow...touching.
ReplyDeleteశ్రీ గారు
ReplyDeleteమాధవుని సమాధానం ఇంకా రాలేదండి. చేరిందో లేదో మరి.
ధన్యవాదాలు.
పద్మార్పిత గారు
ధన్యవాదాలు.