నీవు నా దరి లేని నాడు
కరిగే కాలమే నేనవుతోంది
నీ దరి నేనున్ననాడు
కరిగే నా హృదయమే నువ్వవవుతోంది
నే నీ దరి లేనప్పుడు నీ వలపులతలపే
నాకు పిలుపవుతోంది
నీవు నా దరి నున్ననాడు
నా తలపులన్నీ నీ వలపులవుతున్నాయి
అందుకే ....
మన ఎడబాటు ఒక నిరీక్షణాగీతమైతే
మన కలయిక మరొక కమనీయ కావ్యమవుతోంది
వావ్....కమ్మని కావ్యమే కావాలని కోరుకుంటుంది:-)
ReplyDeleteమన ఎడబాటు ఒక నిరీక్షణాగీతమైతే
ReplyDeleteమన కలయిక మరొక కమనీయ కావ్యమవుతోంది...beautiful lines...chaala baagundi...@sri
పద్మార్పిత గారు
ReplyDeleteఅలాగే. మీ ఇష్టమే నెరవేరాలి. :)
ధన్యవాదాలు
శ్రీ గారు
చాలారోజులతర్వాత వచ్చారు.
ధన్యవాదాలండి.
Ver very Nice...
ReplyDeleteSubha garu
ReplyDeleteThank You .