నాకు తెలుసు
కొన్ని యుగాలుగా నాకై నీవు వేచి చూస్తున్నావని
చూచి చూచి నీవే వచ్చావు
కానీ ప్రభూ ! ఎలా ఆహ్వానించను నిన్ను నా హృదయమందిరంలోకి
మోహపు సంకెలని ఇంకా తెంచలేదు నేను
నిస్వార్ధపు దృష్టిని ఇంకా పొందలేదు నేను
క్రోధపు ధూళిని ఇంకా శుభ్రపరచలేదు నేను
నాలోని నేను ని ఇంకా పంపించలేదు నేను
అందుకే నా హృదయంలో నీకై వెలిగించిన ప్రేమ దీపాన్ని
ముంగిట్లోనే ఉంచి నీ రాకని గ్రహించనట్లు
మౌనంగా హృది తలుపు మూసాను
కానీ,ఇదేమిటి ! తలుపు మూయగలవు కానీ
స్వామి తలపు మానగలవా అని
పదే పదే నన్నెవరు అడుగుతున్నారు ?
కొన్ని యుగాలుగా నాకై నీవు వేచి చూస్తున్నావని
చూచి చూచి నీవే వచ్చావు
కానీ ప్రభూ ! ఎలా ఆహ్వానించను నిన్ను నా హృదయమందిరంలోకి
మోహపు సంకెలని ఇంకా తెంచలేదు నేను
నిస్వార్ధపు దృష్టిని ఇంకా పొందలేదు నేను
క్రోధపు ధూళిని ఇంకా శుభ్రపరచలేదు నేను
నాలోని నేను ని ఇంకా పంపించలేదు నేను
అందుకే నా హృదయంలో నీకై వెలిగించిన ప్రేమ దీపాన్ని
ముంగిట్లోనే ఉంచి నీ రాకని గ్రహించనట్లు
మౌనంగా హృది తలుపు మూసాను
కానీ,ఇదేమిటి ! తలుపు మూయగలవు కానీ
స్వామి తలపు మానగలవా అని
పదే పదే నన్నెవరు అడుగుతున్నారు ?
తలుపు మూయగలవు కాని తలపు మానగలవా అని అడిగితే....ఏంచెప్పగలడు:-)
ReplyDeleteచాలా చాలా బాగుందండి.
బాగుందండి.
ReplyDeleteపద్మార్పిత గారు , "ట్రీ" గారు
ReplyDeleteధన్యవాదాలండి.
అయ్యో...ఇది మిస్ అయ్యాను...చాలా బాగుంది....అబినందనలు...@శ్రీ
ReplyDeleteశ్రీ గారు
ReplyDeleteధన్యవాదాలండి.