Thursday, 8 November 2012

నేను అనుకోలేదు


నీ పలుకు
నా తలపులలో మాత్రమే
మెదిలే కాంచనమవుతుందని
నేను అనుకోలేదు

నీ రాక
నా నిరీక్షణకి
మరొక వేకువ అవుతుందని
నేను అనుకోలేదు

నీ ప్రేమ
నా ఊహల్లో మెదిలే జ్ఞాపకమవుతుందని
నేను అనుకోలేదు

నీ మనసు

నా వేదన కందని శిల అవుతుందని
నేను అనుకోలేదు

    
    
   


5 comments:

  1. వర్మ గారి మాటే నాదీను.

    ReplyDelete
  2. so sad vdana baaledu mottam mida kavita chaala baavundi

    ReplyDelete
  3. వర్మ గారు, సుభ గారు, రమేష్ గారు, చెప్పాలంటే గారు
    మీ అందరి స్పందనకి ధన్యవాదాలండి.

    ReplyDelete