రేయంతా రాసలీల చూసిన ఆకాశం సిగ్గుతో ఎర్రబడుతో నన్ను హెచ్చరిస్తోంది నీ పూజకి వేళవుతోందని.
మాధవా ! అడిగావుగా మరి మైమరపింపచేసే పుష్పాన్ని ఒకటి తెచ్చిపెట్టమని.
విరిసిన నందివర్ధానాలు ఇప్పుడా రావడం అంటూ స్నేహం గా పలుకరించాయి. కోయనా వాటిని .
ఇదిగిదిగో ఇక్కడున్నాను అంటూ మంచుతడిలో ఆకుల చాటున నక్కిన ముద్ద నందివర్ధనం నవ్వుతూ పిలుస్తొంది. తీసుకోబోతుంటే మరొక పిలుపు ఎటు నించి?
అదిగదిగో ఆ మల్లెపొదనుంచి ....
ఆగాగు రాత్రనగా విచ్చితే ఇప్పుడా వచ్చేది అని కాస్త చిన్నబుచ్చుకుంటున్న మల్లెలు . జల్లనా మరి
మేమిక్కడ అంటూ ఎత్తున ఉన్న కరివేరం సుగంధాలు నిన్నూ పిలుస్తున్నాయా ...
నిన్ను తాకితే గాని విచ్చుకోనని మారాం చేస్తున్న మందారం, ఆగలేక తాళలేక రాలిపడుతున్న పారిజాతం ...
అసలైనా ఏది ప్రియం నీకు ?
అలనాడు నాతో ఆడిన పొగడనీడవిరులా లేక పట్టమహిషి భక్తికి తూగిన బృందదళమా
పోనీ ఇవన్నీ ఎందుకు నీ ఆరాధనకి ఆరాటపడుతున్న నా హృదయారవిందాన్ని ప్రియమార తీసుకోరాదా......
మాధవాంకితానికి అంతరంగకుసుమ పరిమళం ముందు ఏ విరులైనా చిన్నబోవా..?..:)
ReplyDeleteAwesome..:)
Sweet! :)
ReplyDeleteకరివేరం అంటే ఏం పూలండీ?
ధాత్రి గారు
ReplyDeleteధన్యవాదాలండి. మీ కామెంట్ మీ కవితా హృదయాన్ని తెలియ చేస్తోంది.
మధురవాణి గారు
ధన్యవాదాలండి. కరివేరం అంటే పింక్ కలరో ఉండి గుత్తుగుత్తులుగా పూస్తాయండి. ప్రస్తుతం నా వద్ద pic లేదు. త్వరలో మీకు మెయిల్ చేస్తాను.
బృందావనం చూపించేసారుగా...చాలా చక్కగా ఉంది...అదిగో రాధ...ఇదిగో మాధవుడు....అభినందనలు...@శ్రీ
ReplyDeleteSree garu
ReplyDeleteధన్యవాదాలండి.