కలనైన కనలేని
ఆరామసీమలెన్నో
కనులుముందు
నిలిచి పిలుస్తున్నాయి
సుదూరతీరాలకొలువైన
గమ్యపుసెలయేరు
గలగలమని చెంతనే
సవ్వడి చేస్తోంది
అవనిని వదిలిన
అనంతదూరాలు
అంతాతామేనని
తెలుసుకోమంటున్నాయి
అంతరానంతరాత్మ
బంధనాలు తెంచుకుని
నింగికెగసి అందుకుంది
అంబరానాంనందననిధిని
నింగికెగసి అందుకుంది
అంబరానాంనందననిధిని
కాంతిజలపుప్రేమసీమని.....
"అంతరానంతరాత్మ
ReplyDeleteబంధనాలు తెంచుకుని
నింగికెగసి అందుకుంది
అంబరానాంనందననిధిని
కాంతిజలపుప్రేమసీమని"
భలేనచ్చింది.
Padmarpita garu
ReplyDeleteThank You.